Atmakur: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజా కార్యక్రమం!
Atmakur: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో దసరా సందర్భంగా ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇన్‌స్పెక్టర్ బాబూలాల్ పిలుపునిచ్చారు.
Atmakur: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజా కార్యక్రమం!
Atmakur: దసరా పండుగను పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ బాబూలాల్ మాట్లాడుతూ... మండల ప్రజలందరూ దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




