Makthal: రాయికోడ్ సమీపంలో భీమా కెనాల్ పూడికతీత పనుల పరిశీలన!

Makthal: నర్వ మండలం రాయికోడ్ సమీపంలో భీమా కెనాల్ కాలువ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి. నియోజకవర్గంలో సాగునీటి పనుల జోరు.

Sowmya
Published on: 22 Oct 2026 1:06 PM IST
Makthal
X

Makthal: రాయికోడ్ సమీపంలో భీమా కెనాల్ పూడికతీత పనుల పరిశీలన!

Makthal: మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా భీమా కెనాల్ పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నర్వ మండలం రాయికోడ్ సమీపంలో కాలువ పూడికతీత పనులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సోదరుడు వాకిటి శేషగిరి ప్రారంభించిన అనంతరం పరిశీలించారు.

రాయికోడ్ నుంచి జక్కన్న పల్లి వ్యవసాయ పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి.

ఈసందర్భంగా వాకిటి శేషగిరి గారు మాట్లాడుతూ రాయికోడ్ నుంచి జక్కన్నపల్లి వైపు సాగునీరు అందించే కాలువలలో పూడికతీత పనులను ప్రారంభించామని అన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా అన్ని మండలాల్లో కాలువల పూడికతీత పనులు ఒక యజ్ణంలా కొనసాగుతున్నాయని, గతంలో పూడికతీత లేక కాలువలు నిర్జీవంగా మారాయని, తిరిగి కాలువలకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు జీవం పోస్తున్నారని అన్నారు.

మంత్రి స్వయంగా రైతు అని, రైతుల కష్టాలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు. పూడిక ఉండటంతో పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేక పోవడంతో పూడికతీత పనులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sowmya

Sowmya