Nagarkurnool: మండ్ల యాదగిరి కుటుంబానికి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పరామర్శ!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా బొమ్మరాజుపల్లిలో మండ్ల యాదగిరి దశదినకర్మకు బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరై నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 6:30 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మండ్ల యాదగిరి కుటుంబానికి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పరామర్శ!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా, ఊరుకొండ మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన మండ్ల యాదగిరి దశదినకర్మ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేఆర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY