Pebbair: ఎండిపోతున్న వరి జూరాల ఎడమ కాలువ నీరు విడుదల చేయాలని బీజేపీ డిమాండ్!

Pebbair: మండలంలో వరి పంటలను కాపాడేందుకు జూరాల ఎడమ కాలువ నుండి వెంటనే నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 3 Aug 2026 11:20 PM IST
Pebbair
X

Pebbair: ఎండిపోతున్న వరి జూరాల ఎడమ కాలువ నీరు విడుదల చేయాలని బీజేపీ డిమాండ్!

పెబ్బేరు: పెబ్బేరు మండలంలోని వరి పంటలను ఆదుకునేందుకు జూరాల ఎడమ కాలువ నుండి వెంటనే నీరు విడుదల చేయాలని BJP నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ, మండలంలో అధిక శాతం గ్రామాల్లో మడికట్టు పొలాల్లో వరి సాగు చేస్తున్నామని తెలిపారు.

నీటి విడుదలపై రైతులు అయోమయంలో ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో BJP వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్ నాయుడు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరసింహనాయుడు, సర్వేష్ గౌడ్, మోతే రాఘవేంద్ర, గోవింద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story