Makthal: అక్రమ ఇసుక దోపిడీపై కలెక్టర్‌కు బీజేపీ ఫిర్యాదు
Makthal: మక్తల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత బి. కొండయ్య కలెక్టర్ ప్రియాంకకు విజ్ఞప్తి చేశారు.
Makthal: అక్రమ ఇసుక దోపిడీపై కలెక్టర్‌కు బీజేపీ ఫిర్యాదు
మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసి ఇసుక మాఫియా పై , వారికి సహకరిస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులపై విచారణ జరిపించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు, ఎక్స్ ఎంపిపి కొండయ్య జిల్లా కలెక్టర్ Ch.ప్రియాంక గారికి విజ్ఞప్తి చేశారు.
నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడు బి. కొండయ్య గారు జిల్లా కలెక్టర్ Ch. ప్రియాంక గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీ, రవాణా వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లో పట్టపగలు అనుమతుల పేరుతోఅక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనీ.., రాత్రి వేళల్లో కూడా అడ్డూ అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న విషయాన్ని వివరించారు.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత ఉండగా, ప్రభుత్వ సహజ సంపద అక్రమంగా దోపిడీకి గురవుతుంటే సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన మంత్రి కూడా మౌనంగా ఉండటంపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.
అక్రమ ఇసుక రవాణాపై సమగ్ర విచారణ జరిపించి, దోపిడీకి పాల్పడుతున్న వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని *బి. కొండయ్య గారు జిల్లా కలెక్టర్ ప్రియాంక గారిని కోరారు. ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులది. అక్రమ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత పాలకులది. ప్రజా సంపద కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండకూడదని ఆయన కలెక్టర్ గారి దృష్టి కి తెచ్చారు.




