Makthal: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: బి. కొండయ్య

Makthal: తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని రాష్ట్ర నాయకులు బి. కొండయ్య మక్తల్ 4వ వార్డు ఓటర్ నమోదు కార్యక్రమంలో పేర్కొన్నారు.

B. NARENDER, MAKTHAL
Published on: 1 Nov 2026 2:53 PM IST
Makthal
X

Makthal: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: బి. కొండయ్య

Makthal: తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బిజెపి దేనని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ బి. కొండయ్య అన్నారు. ఆదివారం నాడు ఆయన మక్తల్ పట్టణంలోని 4 వార్డులో పర్యటించి ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

దేశంలోని ఉత్తర ప్రదేశ్,బీహార్ మహారాష్ట్ర, కర్ణాటకలో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిందని, ఎన్డీఏ నాయకత్వంలో 16 స్థానాలు బిజెపి కైవసం చేసుకోవడంతో నరేంద్ర మోడీ పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు.

కాంగ్రెస్ పదేపదే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓటు చోరీ అయిందని ఆరోపణ చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఈ నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల తో జరిగిందని దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు, తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కల్లూరు నాగప్పగారు,అర్బన్ మండల అధ్యక్షులు, రాజశేఖర్ రెడ్డి గారు,బిజెపి యువ మోర్చ రాష్ట్ర నాయకులు నరేందర్ సాగర్ అడ్వకేట్ గారు, కౌన్సిలర్ పికే నరసింహ గారు, బిజెపి నాయకులు రంకుల ఆంజనేయులు గారు, బిజెపి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, మహేష్ సాగర్ గారు, బ్యాటరీ రాజు గారు, బిజెపి ప్రధాన కార్యదర్శిలు, టైలర్ నరేందర్ గారు,కుర్వ లింగం గారు ,బిజెపి నాయకులు,నాగరాజు గౌడ్, టప్ప అశోక్ గారు, అవుసలి వెంకటేష్ గారు,బూత్ కమిటీ అధ్యక్షులు, కల్లూరి అరుణ్ కుమార్, కల్లూరి ఆంజనేయులు, టింగిలి నవీన్, రంకుల నవీన్ కుమార్, కట్ట రమేష్, బస్వరాజ్, అరవింద్,కుర్వ శివకుమార్, హరీష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL