Makthal: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ బైక్ యాత్ర ప్రారంభం!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మలిదశ ఉద్యమకారుడు రామలింగం మౌన యాత్ర, బైక్ యాత్ర ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 16 Nov 2026 12:59 PM IST
Makthal
X

Makthal: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ బైక్ యాత్ర ప్రారంభం!

Makthal: మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి నివాసం నుండి మౌన యాత్ర ప్రారంభం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు రాష్ట్రం లో పూర్తిగా రైతులు అవ్వలు తాతలు ఆడపిల్లలు సంక్షేమ రంగం బాగుపడాలి అంటే మల్లి CM KCR కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ యాత్ర లో 15 నియోజకవర్గాలు 600 కిలోమీటర్ల యాత్ర 60 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత 70 ఏళ్ల సహకారం ఎవరి నుంచి కాలేదు తెలంగాణ రాష్ట్రం తేవడంలో కేసీఆర్ గారి యొక్క కృషి పట్టుదల నిబద్ధత నాలుగున్నర కోట్ల ప్రజల అభిమానంతో తెలంగాణ సాధించిన గొప్ప దార్శనిక నిర్మాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ గత 9 సంవత్సరాల పరిపాలన కాలంలో విద్య వైద్యం సాగునీరు ఉపాధి అనేక రంగాలలో దేశంలోనే తెలంగాణను అగ్ర భాగాల

నిలిపిన అనుభవజ్ఞులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రైతన్నను తన గుండెల్లో పెట్టుకొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసిన అగ్ర కృషివలుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలవ్వల వరకు నేడు తలవని పిలవని కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో లేదు తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో అనేక విప్లవాత్మకమైన నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశానికే వెలుగును ఇచ్చే రాష్ట్రంగా తయారు చేశాడు.

విద్యుత్ కాంతులతో రైతులకు సాగునీరు తాగునీరు రైతు భరోసాతో ప్రతి పేదవాడి కుటుంబంలో చిరునవ్వులు చూసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో కరువుకోరల్లో రాష్ట్ర రైతాంగం మొత్తం అల్లాడిపోతుంటే నాలుగున్నర కోట్ల ప్రజల సంక్షేమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కు పట్టదా? అని ఆయన అన్నారు.

మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటి అని అన్నారు ఎలినో ప్రభావం తో కరువు వచ్చిందని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు రైతులకు నీళ్లు కరెంట్ రైతు భరోసా ఇవ్వడం లేదని వారు అన్నారు రాష్ట్రం బాగుండాలి అంటే రైతు బాగుండాలి.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం బంద్ చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని వారు డిమాండ్ చేశారు కరెంటు బాగుండాలి రైతు బాగుండాలి నీళ్ళు రావాలి అంటే మల్లి కేసీఆర్ రావాలి ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL