Madanapuram: మదనాపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

Madanapuram: వనపర్తి జిల్లా మదనాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ధర్నా. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె ఆల ప్రీతి రెడ్డి మద్దతు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 7 Nov 2026 2:14 PM IST
Madanapuram
X

Madanapuram: మదనాపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

Madanapuram: వనపర్తి జిల్లా మదనాపురం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె ఆల ప్రీతి రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా జలాలు సమీపంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకుంటే రైతులకు సాగునీటి కష్టాలు ఉండేవి కావన్నారు.

యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, వెంటనే మదనాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA