Nagarkurnool: మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత!
Nagarkurnool: వెల్దండ మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతిచెందిన దండుగుల నారయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ నేత కానుగుల జోగయ్య.
Nagarkurnool: మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన దండుగుల నారయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల కన్యాకుమారి జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల కన్యాకుమారి జోగయ్య 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్ వార్డు మెంబర్ సభ్యులు శేఖర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి జంగా చారి గోపాల్ చారి వెంకటేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.




