Nagarkurnool: వెల్దండలో నీట్ సీటు సాధించిన విద్యార్థిని సరితకు సన్మానం

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన నీట్ విజేత గుద్దేటి సరితను బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు జోగయ్య సన్మానించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Sept 2026 11:51 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: వెల్దండలో నీట్ సీటు సాధించిన విద్యార్థిని సరితకు సన్మానం

Nagarkurnool: వెల్దండ సెప్టెంబర్ 15 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు సాధించిన విద్యార్థిని శాలువలతో సన్మానించారు స్వీట్లు తినిపించి ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నారు

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మాట్లాడుతూ గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు కానుగుల జోగయ్య అన్నారు విద్యార్థినికి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు

అనంతరం విద్యార్థిని పై చదువుకొరకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య 5000 వేల రూపాయలు విద్యార్థినికి అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్ మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్ వార్డు నెంబర్ సభ్యులు శేఖర్ మాజీ వార్డు సభ్యులు నారాయణరెడ్డి సీనియర్ జంగా చారి ఈదులపల్లి జగన్ జోగు రవికుమార్ వెంకటయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY