Veldanda: వెల్దండలో వాన రాసి రాములు కుటుంబానికి పరామర్శ!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో మృతి చెందిన వాన రాసి రాములు కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత కానుగుల జోగయ్య పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Veldanda: వెల్దండలో వాన రాసి రాములు కుటుంబానికి పరామర్శ!
Veldanda: వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్ వార్డు సభ్యులు సిర్సనగండ్ల శేఖర్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరి సత్యం,బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ప్రవీణ్,గోపాల్, బిట్టి సైదులు,వానరాశి రాములు, శివరాజ్, మహేష్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




