Nagarkurnool: ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి.. బీఆర్ఎస్ మండల నాయకులు!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి, దరఖాస్తులను తహసీల్దార్‌కు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Nov 2026 5:31 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి.. బీఆర్ఎస్ మండల నాయకులు!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని పోతేపల్లి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల నాయకులు అంజి మాస్టర్, మంగళపల్లి వెంకటయ్య, ఉపసర్పంచ్ శారదా బాలయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదు ఫారాలను సేకరించి వెల్దండ తహసీల్దార్‌ కార్తీక్ కుమార్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఎల్ఓ శ్రీనివాసులు, జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ హనుమంతు నాయక్ ప్రభాకర్ గోరటి అశోక్ , జంగిలి ఆనంద్, ప్రభాకర్, రవిగౌడ్, తాండ్ర శ్రీను, జోగు రవి, శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY