Makthal: 'లవ్ మక్తల్' బోర్డును శుభ్రం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు!

Makthal: మఖ్తల్‌లో అపరిశుభ్రంగా మారిన 'లవ్ మక్తల్' బోర్డును మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ నాయకులు స్వయంగా శుభ్రం చేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 25 Oct 2026 1:42 PM IST
Makthal
X

Makthal: 'లవ్ మక్తల్' బోర్డును శుభ్రం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు!

Makthal: నారాయణపేట జిల్లా మఖ్తల్ పురపాలిక పరిధిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘లవ్ మక్తల్’ బోర్డు అపరిశుభ్రంగా మారడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.బోర్డుపై ఇష్టానుసారంగా వివిధ రకాల పోస్టర్లు అతికించడంతో పాటు,బోర్డు వద్ద మద్యం సీసాలు,చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వారు పేర్కొన్నారు.

పురపాలక అధికారులు,చైర్‌పర్సన్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగారు.నీటితో బోర్డును శుభ్రం చేసి,పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో పురపాలికకు సంబంధించిన పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని,అధికారులు వాటిపై దృష్టి సారించడం లేదని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ‘లవ్ మక్తల్’ బోర్డును నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు,పురపాలిక పరిధిలో మరమ్మతులు అవసరమైన ప్రాంతాలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని కోరారు.

ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారాస ముఖ్య నాయకులు,యువ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL