Kalwakurthy: కల్వకుర్తిలో నిలిచిపోయిన కార్మికురాలి ఇళ్ల నిర్మాణానికి సాయం!

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిన కార్మికురాలి ఇళ్ల నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో సిమెంట్ అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Sept 2026 10:24 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో నిలిచిపోయిన కార్మికురాలి ఇళ్ల నిర్మాణానికి సాయం!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన *కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మలా * ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలో నిలిచిపోయింది.

ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా *రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ సహకారంతో నిర్మలా ఇంటికి సిమెంటును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, కార్మిక సంఘం నాయకులు వెంకటేష్,వెంకటయ్య,బాలస్వామి, చందు ,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY