Charakonda: జెపల్లిలో బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

Charakonda: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జెపల్లి గ్రామానికి చెందిన దొడ్లపల్లి దూళ్ళ సంధ్యకు మంజూరైన రూ.23 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ప్రజాప్రతినిధులు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 4:53 PM IST
Charakonda
X

Charakonda: జెపల్లిలో బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

చారకొండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జెపల్లి గ్రామానికి చెందిన దొడ్లపల్లి దూళ్ళ సంధ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.23 వేల చెక్కును కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామ ప్రజాప్రతినిధులు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెపల్లి సర్పంచ్ అమినా అశోక్ రాథోడ్, వార్డు సభ్యులు వరికుప్పల నరేష్, మాజీ ఉపసర్పంచ్ మాధవరెడ్డి, గొడ్డెటి సత్యం, వరికుప్పల తిరుపతయ్య, కాటిక దిలీప్, మినుగుల అల్లాజీ, కుంచపు అల్లాజీ, గంటికోట రాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY