Mahabubnagar: ఇసుక మాఫియా దెబ్బకు చెక్ డ్యామ్‌లు ఖతం? దేవరకద్రలో ఉద్రిక్తత
Mahabubnagar: దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో ఇసుక మాఫియా చెక్ డ్యామ్ కూల్చివేతకు యత్నించడంపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
Mahabubnagar: ఇసుక మాఫియా దెబ్బకు చెక్ డ్యామ్‌లు ఖతం? దేవరకద్రలో ఉద్రిక్తత
Mahabubnagar: దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో చెక్ డ్యామ్ కూల్చివేతకు యత్నించిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఇంత దారుణానికి తెగపడితే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.మా హయాంలో 36 చెక్ డ్యామ్ లు నిర్మిస్తే ఇరవై వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఇసుక అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకోవడానికి చెక్ డ్యామ్ కూల్చడానికి వెనకాడలేదన్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు.
రాష్ట్రంలో తొలిసారి ఇటువంటి ఘటన జరిగినపుడు ప్రభుత్వం
ఘాటుగా స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య గట్టిందన్నారు.ఇసుక మాఫియాను అరికట్టడంతో పాటు, చెక్ డ్యామ్ లను రక్షించాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎవరు ఏమనరు అనే ధైర్యంతోనే అర్ధరాత్రి హిటాచీతో వెళ్ళి ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఇంకో దగ్గర కూడా ఇలాగే చేస్తారని.... ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...
ఇసుక మాఫియాను అడ్డుకున్న రైతు మొగిలయ్య ను అభినందించారు.
ప్రభుత్వ సంపద, రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాం ను కాపాడటం అందరికి ఆదర్శమన్నారు. ప్రతిచోట రైతులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఎక్కడిక్కడ తిరగపడితేనే అధికార పార్టీ నాయకులు ఆగడాలకు చెక్ పడుతుందన్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులతో కలిసి దేవర్కద్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలరాజ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, చల్మారెడ్డి, సత్యం సాగర్, కొండల్, అడ్డు, రియాజ్, కురుమూర్తి వివిధ గ్రామాల రైతులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




