Pebbair: పెబ్బేరులో చెకుముకి సైన్స్ పరీక్ష: 1,600 మంది విద్యార్థుల హాజరు
Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో చెకుముకి సైన్స్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Pebbair: పెబ్బేరులో చెకుముకి సైన్స్ పరీక్ష: 1,600 మంది విద్యార్థుల హాజరు
వనపర్తి జిల్లా: పెబ్బేరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో గురువారం పాఠశాల స్థాయి చెకుముకి సంబరాల్లో భాగంగా సైన్స్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించిన ఈ పరీక్షలో సుమారు 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నాగశేషు, మండల అధ్యక్షుడు పెరుమాళ్ల భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరస్వామి, మండల గౌరవ అధ్యక్షుడు పెద్ద కాజా, పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.




