Mahbubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Mahbubnagar: సీఎం రేవంత్ రెడ్డికి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన ఎమ్మెల్యే జియంఆర్. ఆలయాభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 5 Nov 2026 10:03 PM IST
Mahbubnagar
X

Mahbubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

మహబూబ్‌నగర్: శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానిస్తూ దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఈవో, అర్చకుల బృందం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కి అందజేశారు.

అనంతరం కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాటేజీలు, కళ్యాణ మండపం తదితర మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం మరో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి ని కోరారు.

ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి....రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి, ఎమ్మెల్యే జియంఆర్ కి ఆదేశాలిస్తూ...సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, దేవస్థాన అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

శ్రీ.శ్రీ.శ్రీ. కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రతిపాదనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, మండలాల్లో ఇంకా మిగిలిపోయిన రోడ్ల నిర్మాణ పనుల కోసం 99 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు మిషన్ భగీరథ పథకం కింద వివిధ గ్రామాలకు పైప్‌లైన్ల నిర్మాణం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల (OHSR) నిర్మాణాల కోసం 17 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు. ఇట్టి అభివృద్ధి ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల కల్పనతో పాటు కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA