Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మంత్రులు ఉత్తమ్, శ్రీహరిలతో కలిసి నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ-1 పంప్ హౌస్ పనుల పరిశీలన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Jun 2026 9:47 PM IST
Mahbubnagar
X

Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Mahbubnagar: జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ -1 పంప్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి పలు సూచనలు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి గారు మక్తల్ – నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం ప‌నులను పరిశీలించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ సైట్‌ను ఏరియల్ సర్వే చేశారు.

అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి గారు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజీ -1 పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి ఆ ప్రాజెక్టుపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story