Makthal: మక్తల్‌లో మంత్రి శ్రీహరి కీలక వ్యాఖ్యలు!
Makthal: ముదిరాజుల ఆరాధ్య దైవం పండుగల సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.
Makthal: మక్తల్‌లో మంత్రి శ్రీహరి కీలక వ్యాఖ్యలు!
Makthal: ముదిరాజుల ఆరాధ్య దైవమైన పండుగల సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
మక్తల్ పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.తాను వినతిపత్రం అందజేసిన ఆరు రోజులకే స్పందించిన ముఖ్యమంత్రి, పండుగల సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.
ముదిరాజుల ఆరాధ్య దైవమైన పండుగల సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కోరారు.ముదిరాజుల మనోభావాలను గౌరవిస్తూ కార్యక్రమాల నిర్వహణకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.....




