Talakondapally: లింగరావుపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్-8 క్రికెట్ టోర్నీ విజయం
Talakondapally: తలకొండపల్లి మండలం లింగరావుపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్-8 విజయవంతం. విజేతగా పార్డేపురం జంగయ్య జట్టు. బహుమతులు అందజేసిన సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి.
Talakondapally: లింగరావుపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్-8 క్రికెట్ టోర్నీ విజయం
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి, ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన లింగరావుపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్-8 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీల్లో మొదటి బహుమతిని పార్డేపురం జంగయ్య జట్టు, రెండో బహుమతిని సద్దాం జట్టు కైవసం చేసుకున్నాయి.
ఈ టోర్నమెంట్‌కు తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బూత్కూరు వెంకట్ రెడ్డి దాతలుగా సహకరించారు. క్రీడాకారులకు టీషర్టులు అందించేందుకు తిరుపతి గౌడ్, కుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, తిరుపతి, యాదయ్య, చిన్న అంజి, హరీష్ సహకారం అందించారు.
విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన దాతలకు, క్రీడాకారులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.




