Achampet: గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే!
Achampet: సీఎం రేవంత్ రెడ్డి గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహ శంకుస్థాపన, అచ్చంపేటలో బహిరంగ సభలో పాల్గొంటారు.
Achampet: గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదే!
Achampet: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (గురువారం) అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అచ్చంపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారిక టూర్ షెడ్యూల్ విడుదలైంది.
సీఎం పర్యటన షెడ్యూల్:
మ. 2.05 - జూబ్లీహిల్స్ నివాసం నుండి బయలుదేరిక
మ. 2.15 - ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరిక
మ. 3.00 - మద్దిమడుగు హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు
మ. 3.00 - 4.00 - మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహానికి శంకుస్థాపన
సా. 4.15 - అచ్చంపేట హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు
సా. 4.30 - 5.30 - హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు పాదయాత్ర
సా. 5.30 - 6.30 - అచ్చంపేట వై జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ
సా. 6.30 - అచ్చంపేట నుండి రోడ్డు మార్గంలో బయలుదేరిక
రా. 9.00 - హైదరాబాద్ నివాసానికి చేరుకోనున్నారు
సభలో ముఖ్య కార్యక్రమాలు:
సభలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ, లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల విడుదల కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుంది.
ఏర్పాట్లు పూర్తి - కలెక్టర్, ఎమ్మెల్యేల పరిశీలన:
సీఎం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారితో పాటు జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు.
వై జంక్షన్ సభా ప్రాంగణం, లింగాల రోడ్డు ఆర్టీసీ గ్రౌండ్‌లో హెలిప్యాడ్, అంబేద్కర్ కూడలిని పరిశీలించి తాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, భద్రతపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
> ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ: "సీఎం పర్యటనకు పూర్తి ఏర్పాట్లు జరిగాయి. ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం చేతుల మీదుగా చేయడం ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలి."
జెడ్ ప్లస్ భద్రత:
సీఎం జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నందున అచ్చంపేట, మద్దిమడుగులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌ల వద్ద యాంటీ సబోటేజ్ తనిఖీలు, కాన్వాయ్ భద్రత, రోడ్ ఓపెనింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు.




