Nagarkurnool: ముఖ్యమంత్రి ఓటరు నమోదుపై జిల్లా ఎన్నికల అధికారి స్పష్టత

Nagarkurnool: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓటరు నమోదు, డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్‌ అవాస్తవమని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 15 July 2026 11:07 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: ముఖ్యమంత్రి ఓటరు నమోదుపై జిల్లా ఎన్నికల అధికారి స్పష్టత

Nagarkurnool: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓటరు నమోదుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు.

విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఏ నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో ఎలాంటి ఓటరు నమోదు జరగలేదని తెలిపారు.

అలాగే, ముఖ్యమంత్రి పేరుతో రెండు చోట్ల ఓటరు నమోదు (డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్) జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఆయన పేరుతో ఓటరు నమోదు జరగనందున ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియలో ఎలాంటి ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించడం లేదా పంపిణీ చేయడం వంటి ప్రశ్నే తలెత్తదని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని, ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు పంపించడం లేదా ప్రచారం చేయడం మానుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం జిల్లా ఎన్నికల కార్యాలయం లేదా భారత ఎన్నికల సంఘం అధికారిక వేదికలను మాత్రమే విశ్వసించాలని జిల్లా ఎన్నికల అధికారి హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story