Wanaparthy: రోడ్డు విస్తరణ పనుల పరిశీలన.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!
Wanaparthy: వనపర్తి బస్టాండ్ సమీపంలో రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. బస్సు డిపో స్థలం, భవనాల ప్రభావంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Wanaparthy: రోడ్డు విస్తరణ పనుల పరిశీలన.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!
Wanaparthy: అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. బస్సు డిపో ప్రాంతంలో రహదారి విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో డిపోకు సంబంధించి ఎంత మేర స్థలం అవసరం అవుతుందని అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆర్టీసీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి, రోడ్డు విస్తరణలో డిపోకు సంబంధించిన స్థలం ఎంత మేర ప్రభావితమవుతుంది, భవనాలు ఏ మేరకు కోల్పోవాల్సి వస్తుందనే వివరాలను సమగ్రంగా అంచనా వేయాలని ఆదేశించారు. సంబంధిత వివరాలను పరిశీలించి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
పురపాలక చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కమిషనర్ నిరంజన్, డిపో మేనేజర్, తహసిల్దార్లు ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




