Narayanpet: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రియాంక!

Narayanpet: నారాయణపేట కలెక్టర్ సీహెచ్. ప్రియాంకకు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ అవార్డు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన అమలులో విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 12 Oct 2026 7:25 PM IST
Narayanpet
X

Narayanpet: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రియాంక!

Narayanpet: నారాయణపేట జిల్లాలో ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన కార్యక్రమం అమలులో విశిష్ట సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్. ప్రియాంక కు సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి ఈ గుర్తింపు లభించడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ C.H.ప్రియాంక మాట్లడుతూ.. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడం, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాల్లో అధికారులు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ అవార్డు సాధనలో భాగస్వాములైన జిల్లా అధికారులందరికీ, వారి బృందాలకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారం, కృషి, బాధ్యతాయుతమైన పనితీరు ఈ విజయానికి పునాది అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బృంద స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన

నారాయణపేట జిల్లాకు లభించిన ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి మరింత బాధ్యతను పెంచిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA