Gadwal: దివ్యాంగ విద్యార్థుల విజ్ఞాన యాత్ర విజయవంతం – కలెక్టర్ రిజ్వాన్ బాషా

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల (CWSN) కోసం నిర్వహించిన రెండు రోజుల వరంగల్, హైదరాబాద్ విజ్ఞాన, విహార యాత్ర విజయవంతమైందని కలెక్టర్ రిజ్వాన్ బాషా వెల్లడించారు.

GOKARANNA,  GADWAL
Published on: 23 Aug 2026 11:38 PM IST
Gadwal
X

Gadwal: దివ్యాంగ విద్యార్థుల విజ్ఞాన యాత్ర విజయవంతం – కలెక్టర్ రిజ్వాన్ బాషా

గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండలం నుంచి పీఎం శ్రీ పాఠశాలలతో పాటు భవిత కేంద్రాలలో ఉండేటటువంటి 65 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, 30 మంది ఐఈఆర్‌పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు, 11 మంది తల్లిదండ్రులతో ఈనెల 20, 21వ తేదీల్లో రెండు రోజులపాటు వరంగల్, హైదరాబాద్ విహార యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించమన్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి రెండు బస్సులతో ప్రత్యేక అవసరాలు గల (చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్) విద్యార్థుల కోసం నిర్వహించిన రెండు రోజుల యాత్రలో పలు దర్శనీయ స్థలాల్లో పర్యటించారన్నారు.

హైదరాబాదులోని నెహ్రూ జువాలజికల్ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ లను సందర్శించారు. అనంతరం వరంగల్‌లోని భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోటలను సందర్శించి చారిత్రక, సాంస్కృతిక అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారన్నారు.

నెహ్రూ జువాలజికల్ పార్క్‌లో వివిధ జంతువులు, పక్షుల గురించి తెలుసుకున్న విద్యార్థులు, సాలార్జంగ్ మ్యూజియంలో చారిత్రక వస్తువులు, కళాఖండాలను వీక్షించారనీ తెలిపారు. లుంబినీ పార్క్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించినట్లు పేర్కొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story