Wanaparthy: విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి: MEO

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట MPPS పాఠశాలలో AXL కార్యక్రమం కింద సమకూరిన కంప్యూటర్లను ప్రారంభించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 17 Aug 2026 4:22 PM IST
Wanaparthy
X

Wanaparthy: విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి: MEO

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేటలోని MPPS పాఠశాలలో AXL కార్యక్రమం కింద అందించిన కంప్యూటర్లను 6వ వార్డు కౌన్సిలర్ శ్రీ తాటికొండ కృష్ణ, మండల విద్యాధికారి శ్రీ జయరాములు ప్రారంభించారు.

ఈ సందర్భంగా MEO జయరాములు మాట్లాడుతూ కంప్యూటర్ల వినియోగంతో వెనుకబడిన విద్యార్థులకు డిజిటల్ బోధన అందించి, వారి విద్యాభ్యాసాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.

కార్యక్రమంలో AAPC చైర్పర్సన్ శ్రీమతి బాలీశ్వరమ్మ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహ గౌడ్, పాఠశాల హెచ్ఎం శ్రీ చెన్నకేశవులు, చెలిమిల్ల LFL హెడ్మాస్టర్ శ్రీ నారాయణ, PD శ్రీ కురుమయ్య, గ్రామ పెద్దలు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ వెంకట్రాముడు, శ్రీ బొల్లెద్దుల రాముడు, శ్రీ తాటికొండ ఆంజనేయులు, సామాజిక సేవా కార్యకర్త శ్రీ గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీ రవి, శ్రీ నాగిరెడ్డి, శ్రీమతి రజిత, అంగన్వాడీ టీచర్ శ్రీమతి పుష్ప తదితరులు పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story