Urkonda: జకినాలపల్లిలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం!
Urkonda: ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పోలే మార్తమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
Urkonda: జకినాలపల్లిలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం!
ఊర్కొండ: మండలంలోని జకినాలపల్లి గ్రామానికి చెందిన పోలే మార్తమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబానికి మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్ఆర్) ఆర్థిక సాయం అందించారు. మృతురాలి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5,000 అందజేశారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆపద సమయంలో వారికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచులు తలసాని కృష్ణారెడ్డి, పోలే చంద్రయ్య, రెండో వార్డు సభ్యుడు తలసాని నరేందర్ రెడ్డి, నాయకులు పోలే లింగమయ్య, వెంకటయ్య, శేఖర్, గణేష్, గెలవయ్య, కిష్టయ్య, కృష్ణయ్య, జంగయ్య, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.




