Kalwakurthy: పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!

Kalwakurthy: కల్వకుర్తి శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ నేత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. రేకుల షెడ్ నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Sept 2026 11:48 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి * పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం శ్రీ పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద రేకుల షెడ్ నిర్మాణానికి రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) తనవంతు సహకారంగా ఆలయ కమిటీ సభ్యులకు చెక్ రూపకంగా అందజేశారు. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు.

అమ్మవారి సన్నిధిలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు రేకుల షెడ్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,ఆలయ కమిటీ కోరిక మేరకు అభివృద్ధికి తన సహకారం అందించడం జరిగిందని ఆలయాల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో కల్వకుర్తి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.

అనంతరం పట్టణంలోని ఈధమ్మ మాంధాత బోనాల ఉత్సవాలలో కూడా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవా భావాన్ని అభినందిస్తూ,ఆలయ అభివృద్ధికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపుతూ,అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story