Makthal: మక్తల్‌లో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!

Makthal: మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 31 Oct 2026 12:05 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!

Makthal: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నేడు మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్ గారు, మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి తాయప్ప గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ వెంకటేష్ గారు, నీల గౌడ్ గారు, RMP శంకర్ గారు, ఏఎంసీ డైరెక్టర్ ఫయాజ్ గారు, కావలి ఆంజనేయులు గారు,sc సెల్ అధ్యక్షులు చందర్ గారు గార్లపల్లి అశోక్ గౌడ్ గారు వడ్డె బాలరాజ్ గారు తదితరులు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL