Nagarkurnool: తుపాను హెచ్చరిక: నాగర్‌కర్నూల్ విద్యుత్ శాఖ అలర్ట్!
Nagarkurnool: తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ నర్సింహారెడ్డి సూచించారు.
Nagarkurnool: తుపాను హెచ్చరిక: నాగర్‌కర్నూల్ విద్యుత్ శాఖ అలర్ట్!
నాగర్ కర్నూల్: తుఫాను హెచ్చరిక నేపథ్యంలో సిబ్బందికి మరియు వినియోగదారులకు అత్యవసర సూచనలు, రానున్న నాలుగు రోజుల పాటు తుఫాను ప్రభావం, భారీ వర్షాలు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సూపరిoటేoడింగ్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్, నాగర్ కర్నూల్ పరిధిలోని సిబ్బంది మరియు వినియోగదారులు అందరూ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
విద్యుత్ సరఫరా, స్టాఫ్ అందురు తమ గ్రామాలకి సంబందించిన 11 KV, LT లైన్లు, DTRలు, సబ్‌స్టేషన్లను నిరంతరం పర్యవేక్షించాలి. అత్యవసర సిబ్బంది, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు మరియు ఇతర సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మరియు తమ అత్యవసర విధులను నిర్వహించాలి.
ఫాల్ట్ క్లియరెన్స్, విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన వెంటనే స్పందించి, ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేపట్టాలి. ప్రమాదకర పరిస్థితులు, చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ లైన్లపై పడినప్పుడు, స్తంభాలు విరిగినప్పుడు లేదా వైర్లు తెగిపడినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి.
భద్రత, సరైన అనుమతి, షట్‌డౌన్, ఎర్తింగ్ మరియు అవసరమైన PPE లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ లైన్లపై పని చేయకూడదు. ప్రజల భద్రత, తెగిపడిన విద్యుత్ తీగలకు ప్రజలు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ప్రమాద ప్రాంతాన్ని నిరోధించాలి.
సమాచార నివేదిక: ప్రతి గ్రామంలో విద్యుత్ అంతరాయాలు, లైన్ ఫాల్ట్స్, DTR సమస్యలు మరియు పునరుద్ధరణ వివరాలను ఎప్పటికప్పుడు సెక్షన్ కార్యాలయానికి తెలియజేయాలి. 24 గంటల అప్రమత్తత: తుఫాను ప్రభావం తగ్గే వరకు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి రెక్టిఫై చేయగలరు .
ముఖ్య గమనిక: ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కంటే సిబ్బంది మరియు ప్రజల భద్రతే ముఖ్యం. పై సూచనలను సిబ్బంది మరియు వినియోగదారులు అందరూ తప్పనిసరిగా పాటించాలి.




