Somashila: గేట్లు లేక రేకులతో నీటి నిర్వహణ: సోమశిల కాలువ దుస్థితి

Somashila: సోమశిల దక్షిణ కాలువ గేట్లు మరమ్మతులకు నోచుకోక ఇనుప రేకులతో నీరు నియంత్రిస్తున్నారు. నీరు వృథా అవుతోందని వెంటనే మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

Madhav Goud, Nellore
Published on: 9 Aug 2026 12:45 PM IST
Somashila
X

Somashila: గేట్లు లేక రేకులతో నీటి నిర్వహణ: సోమశిల కాలువ దుస్థితి

గేట్లు లేక రేకులు అడ్డు పెట్టి నీటి నిర్వహణ...

సోమశిల: దక్షిణ కాలువకు 8 వ కిలోమీటర్ వద్ద కాలువకు 2 క్రస్ట్ గేట్లు పెట్టి నీటిని నియంత్రిస్తున్నారు, ఈ గేట్లు కిందకు దిగినపుడు డీపీ 3,డీపీ 4 కింద సుమారు 741 ఎకరాలకు సాగు నీరు సరఫరా జరుగుతుంది, కాని గేట్ల నిర్వహణ లేక తుప్పు పట్టి పాడై పోయివున్నాయి, గేట్లు మరమ్మతులు లేక ఇనుప రేకులతో నీటిని నియంత్రిస్తున్నారు,రేకులు అడ్డు పెట్టడం వలన నీరు వృధాగా పోతుంది,జలాశయాలపై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ఇలాంటి చిన్న మరమ్మతులు చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది, గత నెల క్రితం డీపీ 3 కి గండిపడటంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి మరల నీటిని విడుదల చేశారు, రాష్ట్రంలో ఎలినో ప్రభావంతో జలాశయాలలో నీరు అంతంతమాత్రమే వుండటంతో నీటిని పొదుపుగా వినియోగించుకోమని ప్రభుత్వం చెపుతున్న ఆచరణలో అది చూపించడంలో విఫలమౌతున్నారు,అధికారులు ఇకనైనా గేట్లు మరమ్మతులు చేసి నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story