Dasaripally: నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జియంఆర్

Dasaripally: దాసరిపల్లి గ్రామం మీదుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే జియంఆర్ ప్రారంభించారు. సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన, డ్రైనేజీని ప్రారంభించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Updated on: 30 Oct 2026 11:54 PM IST
Dasaripally
X

Dasaripally: నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జియంఆర్

దాసరిపల్లి: మహబూబ్‌నగర్ నుంచి అప్పంపల్లి మీదుగా ఆత్మకూరుకు వెళ్లే బస్సు సర్వీసును ఇకపై దాసరిపల్లి గ్రామం మీదుగా కూడా నడిపించేలా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఈ నూతన బస్సు సర్వీసును దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నామని, అయినా గత బిఆర్ఎస్ పాలకులు స్పందించలేదని, చెప్పులు ఆరిగేలా తిరిగిన పట్టించుకునే పాపాన పోలేదని గ్రామస్తులు గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

అలాగే తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఎమ్మెల్యే జియంఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బస్సు సౌకర్యంతో విద్యార్థులు, రైతులు, గ్రామస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జియంఆర్ కి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA