Uppununthala: ఉప్పునుంతలను కరువు మండలంగా ప్రకటించాలి: రైతు సంఘం
Uppununthala: ఉప్పునుంతల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం తహసీల్దార్ మల్లెల స్వప్నకు వినతిపత్రం ఇచ్చింది.
Uppununthala: ఉప్పునుంతలను కరువు మండలంగా ప్రకటించాలి: రైతు సంఘం
ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, కరువులో రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఏ కె ఎస్ అనుబంధం ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ మల్లెల స్వప్న కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ అనుబంధం మండల కార్యదర్శి చింతల నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప్పునుంతల మండలానికి కరువు సాయం లోనూ వివక్ష చూపారని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
కరువులో రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పంటలు ఎండిపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు కొండల్, రమేష్, శేఖర్, బాలయ్య పాల్గొన్నారు.




