Devarakadra: దేవరకద్ర తహసీల్దార్‌కు కోయిల్ సాగర్ రైతుల వినతి!

Devarakadra: కోయిల్ సాగర్ ఎడమ కాలువలో పూడిక తీయించండి దేవరకద్ర తహసీల్దార్‌కు ఆయకట్టు రైతుల వినతి అక్రమ మోటార్లు తొలగించి చివరి ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్.

GOKARANNA,  GADWAL
Published on: 1 Oct 2026 8:18 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్ర తహసీల్దార్‌కు కోయిల్ సాగర్ రైతుల వినతి!

దేవరకద్ర: ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవక ఏ ఊరిలో కూడా చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెల పోతున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో జూరాల బ్యాక్ వాటర్ నుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు కు నీటిని ఎత్తిపోస్తున్నారు. రైతుల పంటలు ఎండకూడదని కోయిల్ సాగర్ కుడి ఎడమల కాలువల ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు.

కాల్వల ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీని కాలువలలో పూడిక పేరిపోయి చివరి ఐకట్టు రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆది హనుమంత్ రెడ్డి ని కలిసి చర్చించారు.

స్వయానా రైతు అయినటువంటి ఆది హనుమంత్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి కోయిలసాగర్ ఎడమ కాలువలో పూడిక మరియు అక్రమ మోటార్లు తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు పారేవిదంగా చర్య తీసుకొని, చేతికి వచ్చిన పంట ఎండకుండా రైతులని ఆదుకోవాలని దేవరకద్ర తాసిల్దార్ కు, ఎంపీడీఓ కు వినతిపత్రం అందచేశారు . ఈ కార్యక్రమంలో కోయిల్ సాగర్ ఎడమ కాలువ19,20,21,22 స్లూయిస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL