devarakadra: కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల కటింగ్‌పై ఆగ్రహం
devarakadra: దేవరకద్ర మీనాక్షి కన్వెన్షన్ హాల్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్.
devarakadra: కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల కటింగ్‌పై ఆగ్రహం
దేవరకద్ర: మున్సిపాలిటీ కేంద్రంలోని మీనాక్షి కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోజు దేవరకద్ర బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అడుగడుగునా దగా చేస్తోందని అన్నారు. కేంద్రం ఎంత ధాన్యం కొంటే మేము అంతే ధాన్యం రైతునుండి సేకరిస్తామనడం సబబు కాదని అన్నారు.
కేంద్రంతో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని, కోనేంతవరకు మేము ఊరుకోమని తెలిపారు. మరోవైపు యూరియా కోసం రైతులకు యాప్ తీసుకొచ్చామని తెలిపారు కానీ యాప్ లో యూరియా కనబడుతుంది కానీ షాప్ కి వెళ్లేసరికి యూరియా లేకుంటుంది. యూరియాను నేరుగా షాపుల్లోనే విక్రయించి రైతులను ఆదుకోవాలని కోరారు.
రైతు భరోసా ఎకరానికి 7500 చొప్పున సంవత్సరానికి 15 వేల రూపాయలు వేస్తామన్నారు కానీ ఇప్పటికే రెండు దఫాలు రైతు భరోసా డబ్బులను ఎగ్గొట్టారని ఇచ్చిన ఒక్కసారి మాత్రం అది 6000 ఎకరాకు మాత్రమే ఇచ్చారని రెండోసారి రెండు ఎకరాల వరకే పరిమితం చేసి మిగిలిన వారికి ఎగ్గొట్టారని వాపోయారు. సన్నాళ్లకు బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులందరూ సన్నాలు పండించారు.
కానీ ప్రభుత్వం ఒక పంటకు మాత్రమే బోనస్వేసి మరో పంటలో రైతుల నుండి సన్నాలు కొంటే బోనస్ వేయాల్సి వస్తుందని కొనడంలో జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ఏదో ఒక సమస్యను సృష్టించి రైతులను ఉప్పు తిప్పలు పెడుతున్నారని ఒక దగ్గర గన్ని బ్యాగులు ఉండవని, మరో దగ్గర లారీలు రావని, మరోచోట మిల్లర్లు క్వింటాలుకు 15 కిలోల చొప్పున కటింగ్ చేయడం తో రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇన్ని విధాలుగా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, జట్టి నర్సింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ముడా మాజీ డైరెక్టర్ కర్ణంరాజు, కొండారెడ్డి, సత్యం సాగర్, బాలరాజు,దొబ్బలి ఆంజనేయులు ,ఉస్కిల్ల వెంకట రాములు, రాధాకృష్ణ, శ్యాంసుందర్ రెడ్డి, గౌని రవీందర్ రెడ్డి ,కొండల్, రాము గౌడ్, మధుసూదన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




