Devarakadra: పంటలు ఎండడానికి బీఆర్‌ఎస్ నేతలే కారణం: అంజిల్ రెడ్డి!

Devarakadra: దేవరకద్ర నియోజకవర్గంలో పంటలు ఎండిపోవడానికి బీఆర్ఎస్ గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు ఆరోపించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 28 Oct 2026 5:26 PM IST
Devarakadra
X

Devarakadra: పంటలు ఎండడానికి బీఆర్‌ఎస్ నేతలే కారణం: అంజిల్ రెడ్డి!

దేవరకద్ర: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే దేవరకద్ర నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి బుధవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. డోకూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించి ఎండిన పంటలను చూయిస్తూ రైతులను ఓదార్చాల్సింది పోయి నిరోత్సాహపరుస్తున్నారని, అధైర్యపరుస్తున్నారని అన్నారు.

గత పది సంవత్సరాల కాలంలో కనీసం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి దేవరకద్ర పెద్ద చెరువుకు గ్రావిటీ కెనాల్ కూడా పూర్తి చేయలేదని, మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వచ్చిన తర్వాతనే నాగారం వద్ద గ్రావిటీ కెనాల్ ను అడ్డుకున్న రైతుకు నష్టపరిహారం చెల్లించి గ్రావిటీకెనాల్ ను పూర్తి చేశారని తెలిపారు.

మరోవైపు 800 కిలోమీటర్ల కుప్పం కు నీళ్లు వెళుతున్నాయి అంటే దానికి కారణం గత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఆంధ్ర నాయకుల రొయ్యల పులుసులు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాటిచ్చి నీళ్లు వదలడానికి సంతకాలు చేశారని ఆరోపించారు. ముందు చూపుతో జూరాలకు నీళ్లు వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి కోయిల్ సాగర్ కు నీళ్లు తరలించిన ఘనత మా ఎమ్మెల్యే జిఎంఆర్ దే అని అన్నారు.

దేవరకద్రలోనే కాదు దేశమంతా ఎల్ నినో ప్రభావం ఉందని అన్నారు.డోకూరు గ్రామ సర్పంచ్ మాలెల శ్రీనివాసులు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యేను స్థానిక నాయకులే తప్పుదోవ పట్టించారని, మీరు పరిశీలించిన పంట పొలానికి పెద్ద చెరువు నీళ్లు రావని, గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కోయిల్ సాగర్ కెనాల్ ను కుమ్మరి కుంట వరకే తీశారని, పెద్ద చెరువుకు కెనాల్ తీయలేదని అన్నారు.

మిషన్ కాకతీయ లో పెద్ద చెరువుకు కోటి రూపాయలు మంజూరవగా తూతూ మంత్రంగా పనులు చేసి 30 లక్షల రూపాయల నిధులు డ్రా చేసుకున్నారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మాలెల శ్రీనివాసులు, కుమ్మరి సాయిలు, శివ, భాస్కర్ రెడ్డి, లక్ష్మీ ఆంజనేయులు, కొమరి బాలరాజు, నర్సింహులు, ఉసేనప్ప, శేఖర్ రెడ్డి, హనుమంతు, మాజీ సర్పంచ్ రామాంజనేయులు, బన్నీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA