Devarakadra: దేవరకద్రలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనం
Devarakadra: వరకద్రలో గుండెపోటుతో మరణించిన మిత్రుడు సత్యనారాయణ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, పిల్లల చదువు బాధ్యత తీసుకున్న స్నేహితులు.
Devarakadra: దేవరకద్రలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనం
దేవరకద్ర: మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన తోటి స్నేహితుడు సత్యనారాయణ గుండెపోటుతో అకాల మరణం చెందగా, సత్యనారాయణ కుటుంబానికి అండగా నిలవాలని స్నేహితులందరూ ఏకమయ్యారు. ఆయన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్నేహితులందరూ కలిసి రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయంగా అందజేశారు.
అంతేకాకుండా అ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చులను కూడా భరిస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం ఎంతో అభినందనీయం. సత్యనారాయణ మన మధ్య లేకపోయినా, ఆయనపై ఉన్న ప్రేమ, స్నేహం, అనుబంధం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
స్నేహం అంటే మాటల్లో కాదు... అవసరమైన సమయంలో అండగా నిలవడంలో ఉంటుందని తోటి వారు అంటున్నారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపిన స్నేహితులు.




