Devarakadra: అక్రమ కేసులు పెట్టింది మీరు.. ఇబ్బంది పడింది మా కార్యకర్తలు
Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు.
Devarakadra: అక్రమ కేసులు పెట్టింది మీరు.. ఇబ్బంది పడింది మా కార్యకర్తలు
Devarakadra: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ, సోమవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించాలనడం సరైనది కాదు. తరలించాలని సంతకాల సేకరణ చేస్తున్న వారు కనీసం నన్ను సంప్రదించలేదు.
సంతకాల సేకరణ చేస్తున్నవారు సంప్రదిస్తే, ఆ స్కూల్ ప్రాధాన్యత, అక్కడ ఎందుకు నెలకొల్పుతున్నామో వివరించే వాడినన్నారు. మీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఇథనాల్ కంపెనీ వల్ల సుమారు 26 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ కంపెనీ మూసి వేయించేందుకు ప్రయత్నం చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అని తెలిపారు.
చిన్న చింతకుంట మండలం లో ఎక్కడ కూడా స్కూల్ కు అవసరమైన 25 ఎకరాల భూమి లేదు. కురుమూర్తి జాతర వద్ద ఉన్న స్థలం జాతర అవసరాలకు సరిపోదు. కురుమూర్తి స్వామి దేవాలయాన్ని యాదగిరిగుట్టలా అభివృద్ధి చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్న ప్రాంతంలో నాకు ఇంచు భూమి లేదు, స్థలం ఉన్నట్లు నిరూపిస్తే, మీకే ఇచ్చేస్తా.
నాకు ఉన్నదే ఐదు ఎకరాల భూమి, మీలాగా వందల ఎకరాల భూమి లేదన్నారు. ఇప్పటి వరకు ఎవర్ని కేసులు పెట్టి బెదిరించి పార్టీలోకి తీసుకోలేదు, ఆ అవసరం మాకు లేదు. యెస్ నేను అడ్వకేట్ ని, ఎక్కడా కూడా కేసులు పెట్టాలని ఎవరిపై జోక్యం చేయలేదు. పోలీసులకు ఏ సెక్షన్ లో పెట్టాలో చెప్పినట్లు ఆరోపణలు చేయడం కాదు, ఆ ఆరోపణలను రుజువు చేయాలి.
నీ పదేళ్ల పాలనలో, మా పాలనలో నమోదైన కేసుల లెక్క తీద్దాం. జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరితే చిన్నచింతకుంట లో మా కార్యకర్తలపై కేసు పెట్టించావు. పేరూరులో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతుంటే అడ్డుకున్నందుకు, మా కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టించిన ఘనత మీది.
కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో పింఛన్లు అందరికీ ఇవ్వండి, క్రమ పద్ధతిలో ఇవ్వండి అని గ్రామపంచాయతీ కార్యాలయంలో శాంతియుతంగా కోరితే మా కార్యకర్తలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి 13 రోజులు జైలుకు పంపిన చరిత్ర మీది.
మీరు పెట్టిన ఇబ్బందులకు తట్టుకుని, మా కార్యకర్తలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడి, మా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు. మీలా మేము ఎన్నడూ అక్రమ కేసులు పెట్టలేదు. సంతోష్ రెడ్డిపై కేసులు పెట్టిందే మీరు, మీ ప్రభుత్వ హయాంలోనే అతనిపై 9 కేసులు నమోదు అయ్యాయి. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతోందని మీరు అంటున్న ఆరోపణలు అవాస్తవం.
మా తమ్ముడిని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు, అతను ఆర్కిటెక్ గా తన వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు, రాజకీయాలకు మేము సేవ చేయడానికి వచ్చాం తప్ప దోచుకోవడానికి రాలేదు, నిస్వార్ధంగా ప్రజలకు పనిచేయడానికి ఉన్నాం, దొంగ పనులు చేసి సంపాదించే అవసరం మాకు లేదు.
కొల్లూరు లో 100 కోట్లు పెట్టి కొన్నట్లు చెబుతున్న నువ్వు, దానిని నిరూపించు, అక్కడే వదిలేస్తా. నేను అన్నది ఎప్పుడు ఎన్నికలు పెట్టిన 50 వేల మెజార్టీతో గెలుస్తా అన్నా, అంతేకానీ నువ్వు రాజీనామా చేయమంటే, చేయడానికి కాదు. దేవరకద్ర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మినిమం 10 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటా. హుందాతనం గురించి మాట్లాడుతున్నావ్, మొదట తెలంగాణ భవన్ లో హుందాతనం మరిచి మాట్లాడింది ఎవరు.
ప్రతిపక్ష నాయకుడిగా దేవరకద్ర అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి తప్పకుండా స్వీకరిస్తాం అంతేకానీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే, చేస్తున్న అభివృద్ధి విషయంలో అపోహలు, అసత్యాలు సృష్టిస్తే, మీకు దేవరకద్ర ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు.
దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా ప్రణాళిక రచించుకుని ముందుకు పోతున్న. అందులో ముఖ్యంగా భవిష్యత్ లో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి, వారికి మంచి భవిష్యత్తు అందించాలన్నదే నా తాపత్రయం, దానికోసం అనునిత్యం ప్రజలతోనే ఉంటూ పని చేస్తా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




