Devarakadra: దేవరకద్ర సరస్వతీ విగ్రహావిష్కరణ, సీసీ కెమెరాల ప్రారంభం!
Devarakadra: మహబూబ్నగర్ జిల్లా అడవి అజిలాపూర్లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించి, సరస్వతీ మాత విగ్రహావిష్కరణ మరియు భూమిపూజ చేశారు.
Devarakadra: దేవరకద్ర సరస్వతీ విగ్రహావిష్కరణ, సీసీ కెమెరాల ప్రారంభం!
దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామ స్టేజ్ దగ్గర ప్రత్యేక సీసీ కెమెరా ప్రారంభోత్సవం, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన,సరస్వతీ మాత విగ్రహావిష్కరణ కార్యక్రమాలను గురువారం రోజు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై తన చేతుల మీదుగా సీసీ కెమెరాలను ప్రారంభించడంతో పాటు సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుందని,నేరాల నియంత్రణకు,శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ముదిరాజ్ కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాఠశాల ఆవరణలో సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.విద్యకు, జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీ మాత విగ్రహావిష్కరణతో విద్య పట్ల గౌరవాన్ని చాటినట్లు అయింది.
విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.పదవ తరగతి లో 500 పైచిలుకు మార్కులు సాధించిన గ్రామానికి చెందిన విద్యార్థులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజల్ రెడ్డి,గ్రామ సర్పంచ్ అక్కినోల అనంతమ్మ,రాజు గౌడ్, సరస్వతి విగ్రహ దాత రాములు యాదవ్,చిన్నయ్య,గూరకొండ ఆంజనేయులు ముదిరాజ్, రవి ముదిరాజ్, కళ్ళు వెంకటేష్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు యువకులు,మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.




