Mahabubnagar: యుద్ధ ప్రాతిపదికన వరి కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్!

Mahabubnagar: దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాతో భేటీ అయ్యారు. వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 30 April 2026 11:48 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: యుద్ధ ప్రాతిపదికన వరి కొనుగోళ్లు చేపట్టాలి: కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్!

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ని కలసి వరి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని,కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని,అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా ఎండలను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L3 సమస్యలను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story