Devarakadra: 9 PACSలకు నూతన చైర్మన్లు.. ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే!

Devarakadra: దేవరకద్ర నియోజకవర్గంలోని 9 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతనంగా నియమితులైన చైర్మన్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 6 Nov 2026 1:53 PM IST
Devarakadra
X

Devarakadra: 9 PACSలకు నూతన చైర్మన్లు.. ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే!

Devarakadra: దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని 9 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) నూతన చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సంబంధిత చైర్మన్లకు అందజేశారు.

నూతనంగా నియమితులైన PACS చైర్మన్ల వివరాలు:

నాగారం – హెచ్. రాజన్న

భూత్పూర్ – హర్య నాయక్

పోల్కంపల్లి – బండ సురేందర్ రెడ్డి

అప్పంపల్లి – ఎస్. వెంకటేష్

ముచ్చింతల్ - మక్తల్. శ్రీనివాస్ రెడ్డి

పామాపురం – ఎన్. బీచుపల్లి యాదవ్

దేవరకద్ర – కే. అరవింద్ రెడ్డి

అడ్డాకుల – గంగుల విజయ మోహన్ రెడ్డి

కొత్తకోట – రావుల జితేందర్ నాథ్ రెడ్డి

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన PACS చైర్మన్లు, డైరెక్టర్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ని కలిసి తమకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సహకార సంఘాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA