Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

Devarakadra: దేవరకద్ర మున్సిపల్ ఆఫీసులో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 2 Jun 2026 4:54 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీ ఆఫీసులో రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మరియు కౌన్సిలర్లు. అనంతరం మండల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ చైర్మన్ దమయంతి మరియు వైస్ చైర్మన్ కె. యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దేవరకద్ర మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE - Personal Protective Equipment) కిట్లను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. నిరంతరం మురికి, వ్యర్థాలతో పనిచేసే క్రమంలో కార్మికులు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకే ఈ పీపీఈ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడు విధి నిర్వహణలో తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు మరియు రక్షణ పరికరాలను ధరించాలని వారు సూచించారు.

కార్మికుల సంక్షేమానికి, వారి భద్రతకు మున్సిపాలిటీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story