Devarakadra: దేవరకద్రలో వర్షాల కోసం శివునికి జలాభిషేకం

Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని శివాలయంలో గర్భగుడి నీటితో నింపి జలాభిషేకం, ప్రత్యేక పూజలు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 20 July 2026 12:12 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో వర్షాల కోసం శివునికి జలాభిషేకం

Devarakadra: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలంటూ స్థానిక శివాలయంలో శివుడికి జలాభిషేకం చేసిన గ్రామస్తులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని శివాలయంలో గ్రామ మహిళలు, యువతి యువకులు, పెద్దలు, పిల్లలు వ్యాపారస్తులు, రైతులు అందరూ కలిసి స్థానిక శివాలయంలో శివుడికి జలాభిషేకం చేశారు.

ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకు కూడా దేవరకద్ర తో పాటు పరిసర గ్రామాలలో వర్షాలు పడక వేసిన విత్తనాలు భూమిలోని ఎండిపోతున్నాయని అందువల్ల అందరం కలిసి శివుడికి జలాభిషేకం చేసి శివలింగం నీటిలో మునిగేంత వరకు గర్భగుడిలో నీరు నింపి పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు మంచిగా పండాలని, పశుపక్ష్యాదులకు త్రాగునీటి కొరత రాకుండా ఉండాలని శివయ్యను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్

కొండా దమయంతి గోవర్ధన్ రెడ్డి, ఆలయ ఈవో శివానంద చారి, అర్చకులు నాగరాజు, నాగభూషణం, కౌన్సిలర్లు , వ్యాపారస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story