Devarakadra: రాబోయేది బీసీల రాజ్యమే దేవరకద్ర సభలో తీన్మార్ మల్లన్న
Devarakadra: దేవరకద్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ. 2028లో బిసిల రాజ్యమే లక్ష్యమని, దేవరకద్ర గడ్డపై బిసి జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్య.
Devarakadra: రాబోయేది బీసీల రాజ్యమే దేవరకద్ర సభలో తీన్మార్ మల్లన్న
దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాట్లాడుతూ 2028 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలను చైతన్యం చేస్తామన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేదన్నారు. నియోజకవర్గంలో కేవలం 11 వేల ఓట్లు ఉన్న అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రెండు లక్షల ఓట్లు ఉన్న బీసీలు ఎమ్మెల్యే కావడం లేదు కావున రాబోయే ఎన్నికలలో బీసీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ బిఫామ్ పై గెలిచావని,నన్ను రాజీనామా చేయమని అడుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఎందుకంటే 59 నియోజకవర్గాలలో ప్రచారం చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేను గెలిపించానని తీన్మార్ మల్లన్న అన్నారు.
రాబోవు ఎన్నికలలో దేవరకద్ర గడ్డపై బీసీ జెండా ఎగరవేస్తామని అన్నారు. అనంతరం మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గం టిఆర్పి పార్టీ ఇన్చార్జ్ రఘువీర్ వర్మ, జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నట్టలి నిరంజన్, మండల అధ్యక్షుడు చంద్రమౌళి, చుక్కల రాయుడు, మన్యం, మంగారాయి వెంకటేష్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




