Devarakonda: అడ్డాకుల పీఏసీఎస్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే జిఎంఆర్
Devarakonda: అడ్డాకుల మండల కేంద్రంలో పీఏసీఎస్ నూతన చైర్మన్ విజయమోహన్ రెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
Devarakonda: అడ్డాకుల పీఏసీఎస్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర నియోజకవర్గం: అడ్డాకుల మండల కేంద్రంలో పీ.ఏ.సీ.ఎస్ నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR)
అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహించిన పీఏసీఎస్ నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) గారి దంపతులు పాల్గొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ విజయమోహన్ రెడ్డి గారితో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన పాలకవర్గం పని చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, మన రాష్ట్రంలోనే కాదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తో సహా అనేక రాష్ట్రాల్లో కరువు నెలకొందని అన్నారు. అడ్డాకుల మండలం ఇప్పటికే కరువు మండలంగా ప్రకటించబడిందని తెలిపారు.




