Makthal: మక్తల్‌లో 'ఇరుముడి' సినిమా కోసం భక్తుల ధర్నా!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ వెంకటరమణ థియేటర్‌లో 'ఇరుముడి' సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో భక్తులు ధర్నా. సినిమాను మళ్లీ ప్రదర్శించాలని డిమాండ్.

B. NARENDER, MAKTHAL
Published on: 26 Aug 2026 12:56 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో 'ఇరుముడి' సినిమా కోసం భక్తుల ధర్నా!

Makthal: నారాయణ పేట్ జిల్లా మక్తల్ వెంకటరమణ సినిమా థియేటర్‌లో అయ్యప్ప స్వామి భక్తి, హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించే “ఇరుముడి” భక్తి మూవీ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూడాలని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మక్తల్‌కు వస్తున్నారు.

గత మూడు, నాలుగు రోజులుగా చాలామంది టికెట్లు దొరకక వెనుదిరుగుతున్నారు. నిన్న రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు థియేటర్‌కు వెళ్లినా టికెట్లు దొరకక తిరిగి వచ్చారు.

అయితే ఈరోజు ఉదయం చూస్తే “ఇరుముడి” కాకుండా వేరే సినిమా ప్రదర్శన ఉందని థియేటర్ ముందు బోర్డు పెట్టారు. ఇరుముడి సినిమా చూద్దాం అని థియేటర్ కు వస్తే అక్కడ పోస్టర్ వేరే ఉండడం తో అవక్కయ్యారు.

ఈ సినిమా చూడాలని చాలామంది తమ సొంత పనులను పక్కన పెట్టుకుని థియేటర్‌కు వస్తున్నారు. టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినా, టికెట్లు దొరకకపోయినా వెయిటింగ్‌లో ఉండి, అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

ప్రజల వినతిని గౌరవించి “ఇరుముడి” భక్తి మూవీని తిరిగి వెంకటరమణ థియేటర్‌లో ప్రదర్శించాలని ధర్నా చేయడం తో థియేటర్ యాజమాన్యం వెంటనే తేరుకొని ఇరుముడి సినిమా ను ప్రదర్శిస్తామని తెలపడం తో సినిమాకు వచ్చిన భక్తులు శాంతిచారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL

Next Story