Urkonda: మృతుల కుటుంబాలకు డీఎన్‌ఆర్ ఆర్థిక చేయూత
Urkonda: నాగర్‌కర్నూల్ జిల్లా ఇప్పపహడ్‌లో అనారోగ్యంతో మృతి చెందిన రెండు నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ నేత డీఎన్‌ఆర్ ఆర్థిక సాయం అందజేశారు.
Urkonda: మృతుల కుటుంబాలకు డీఎన్‌ఆర్ ఆర్థిక చేయూత
ఊర్కొండ: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఇప్పపహడ్ గ్రామానికి చెందిన చిలువేరు సాకలి సత్తయ్య, వర్కల సాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్) కాంగ్రెస్ నాయకుల ద్వారా ఇరు కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మాదారం శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు దుబ్బ మల్లేష్, నాగరాజు, జెట్టి హరికృష్ణ, బాలస్వామి, వార్డు సభ్యులు డి. శ్రీశైలం, పి. వెంకటేష్, కే. లక్ష్మయ్య గౌడ్, డి. రమేష్, పి. బుచ్చయ్య, కే. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




