Narayanpet: నాటు కట్టు వికటించి యువకుడి చేతికి తీవ్ర ముప్పు.. కాపాడిన వైద్యులు!

Narayanpet: నాటు కట్టు వికటించి చేయి కోల్పోయే స్థితికి చేరిన మక్తల్ యువకుడికి నారాయణపేట యశోద కేర్ హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ డి. నరేందర్.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 25 Nov 2026 1:30 PM IST
Narayanpet
X

Narayanpet: నాటు కట్టు వికటించి యువకుడి చేతికి తీవ్ర ముప్పు.. కాపాడిన వైద్యులు!

Narayanpet: మక్తల్ మండలానికి చెందిన రాజశేఖర్‌కు చేతి ముంజేయిలోని రేడియస్, అల్నా ఎముకలు విరగడంతో అర్హత కలిగిన ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించకుండా నాటు వైద్యం చేసే వ్యక్తి వద్ద బిగుతుగా నాటు కట్టు వేయించుకున్నాడు. ఈ కట్టు కారణంగా చేతి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి తీవ్ర వాపు, రక్తంతో కూడిన బొబ్బలు దుర్వాసనతో కూడిన చీము స్రావం వంటి సమస్యలు తలెత్తాయి.

తీవ్రమైన పరిస్థితిలో నారాయణపేట పట్టణంలోని యశోద కేర్ హాస్పిటల్స్ (ఓల్డ్ గంజ్) కు వచ్చిన రోగిని వైద్య బృందం పరీక్షించి, స్కానింగ్‌లో తీవ్రమైన సెల్యులైటిస్ మృదు కణజాల ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన మార్పులను గుర్తించింది. మరియు అతిగా బిగుతుగా, సరైన ప్యాడింగ్ లేకుండా కట్టే నాటు కట్టు వల్ల రక్తం తిరిగి గుండెకు చేరే ప్రక్రియ దెబ్బతిని, రక్తం పేరుకుపోవడం, కణజాలం దెబ్బతినడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చని వైద్యులు తెలిపారు. సకాలంలో సరైన చికిత్స అందకపోతే చర్మం కుళ్లిపోవడం, ఎముకలకు ఇన్ఫెక్షన్, కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

యశోద కేర్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ డి. నరేందర్ ఆధ్వర్యంలో అవసరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ చికిత్సలో డాక్టర్ నీలా వర్ణ మరియు సీనియర్ OT అసిస్టెంట్ నరేష్ పాల్గొన్నారు.ప్రస్తుతం రోగి క్షేమంగా ఉన్నాడని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, “ఫ్రాక్చర్ అంటే కేవలం ఎముక విరగడం మాత్రమే కాదు. ఎముకలతో పాటు రక్తనాళాలు, నరాలు, చర్మం, మృదు కణజాలాన్ని కూడా కాపాడటం ఎంతో ముఖ్యం.

నాటు వైద్యం పేరుతో అర్హతలేని వ్యక్తుల వద్ద బిగుతైన కట్లు వేయించుకోవడం ప్రమాదకరం. ఎముకలు విరిగిన వెంటనే అర్హత కలిగిన ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి” అని సూచించారు.నారాయణపేట జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే యశోద కేర్ హాస్పిటల్స్ లక్ష్యమని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఆర్థోపెడిక్ చికిత్స, స్కానింగ్, డిజిటల్ ఎక్స్‌రే, శస్త్రచికిత్స వంటి సేవలను అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు తెలిపింది.ప్రజలకు విజ్ఞప్తి: నాటు కట్టును నమ్మి మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దు. ఎముకల చికిత్సను అర్హత కలిగిన ఆర్థోపెడిక్ వైద్యుడితోనే చేయించుకోండి.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA