Mahabubnagar: కోయిల్ సాగర్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిరసన!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి లగచర్లకు నీటి తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిరసన తెలిపారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 20 Nov 2026 4:21 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: కోయిల్ సాగర్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిరసన!

మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు దగ్గర బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోయిల్ సాగర్ నుండి కొడంగల్ కు నీటిని తీసుకెళ్తున్నారని 20 రోజుల కిందట హెచ్చరించినా కూడా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు.

ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకుండా ఇప్పుడు 490 కోట్ల వ్యయంతో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల నీటిని మద్దూర్, కోస్గి పట్టణాలతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం లగచర్లకు తరలించేందుకు ప్రతిపాదనలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే కోయిల్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు సరైన సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాలకు నీటిని తరలించే ఆలోచన చేయడం సరికాదన్నారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రాజెక్ట్ ఆయకట్ట రైతులకు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మాధవి యుగేందర్ రెడ్డి, రాధా కొండల్, కొండారెడ్డి, బాలరాజ్, ఉస్కీల వెంకట్ రాములు, సత్యం సాగర్, కేబీఆర్ గౌడ్, రాము గౌడ్, అడ్డు, భార్గవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA